Karnataka BJP Leaders Complains To Governor On Speaker || Oneindia Telugu

2019-07-18 78

In a meeting with the Governor, BJP complained that the Speaker was delaying the process without holding floor test. Former CM Jagadish Shettar was leading the delegation. BJP legislators Arvind Limbavalli, Basavaraj Bommai and SR Vishvanath joined Shettar to meet the Governor.
#karnataka
#Governor
#bjp
#speaker
#CM
#floortest
#congress
#jds
#mlas
#govt

కర్ణాటక శాసన సభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకులు ఒక్కసారిగా రూట్ మార్చారు. గురువారం మద్యాహ్న శాసన సభా సమావేశాల భోజన విరామం తరువాత బీజేపీ నాయకులు కర్ణాటక గవర్నర్ వాజూబాయ్ వాలాను కలిసి శాసన సభా సమావేశం జరిగిన తీరును వివరించిన తరువాత స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారని తెలిసింది. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి సిద్దం అయ్యారని బీజేపీ నాయకులు గుర్తు చేశారు. అయితే శాసన సభ సమావేశాలు ప్రారంభం అయిన తరువాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదని, చర్చకు అవకాశం ఇచ్చారని బీజేపీ నాయకులు గవర్నర్ వాజూబాయ్ వాలాకు ఫిర్యాదు చేశారని తెలిసింది.

Videos similaires